పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని జేఎస్‌ఎన్ కాలనీకి చెందిన కనకదుర్గ(43) అనే మహిళ వడ్డీవ్యాపారుల వేధింపులకు తాళలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
వడ్డీ వ్యాపారి వేధింపులు: మహిళ ఆత్మహత్య
Jan 20 2016 11:19 AM | Updated on Sep 26 2018 6:15 PM
తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని జేఎస్‌ఎన్ కాలనీకి చెందిన కనకదుర్గ(43) అనే మహిళ వడ్డీవ్యాపారుల వేధింపులకు తాళలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మంచిలి మండలానికి చెందిన వెంకట లక్ష్మీ అనే వడ్డీ వ్యాపారి వద్ద ఇంటి పత్రాలు కుదువపెట్టి రూ. 5 లక్షల అప్పు తీసుకుంది.
ఇప్పటి దాకా రూ. 7 లక్షల రూపాయల దాకా అసలు, వడ్డీ చెల్లించినా వడ్డీ వ్యాపారులు పత్రాలు ఇవ్వకపోగా ఇంకా డబ్బు కట్టాలని వేధించడంతో మనస్థాపానికి గురైన కనకదుర్గ బుధవారం ఉదయం బాత్‌రూమ్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా అప్పటితే మృతి చెందింది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Advertisement
Advertisement