చిట్టిల మోసగాడికి మహిళల దేహశుద్ధి | Women beated man by cheating with chitties | Sakshi
Sakshi News home page

చిట్టిల మోసగాడికి మహిళల దేహశుద్ధి

Feb 26 2015 9:47 PM | Updated on Sep 2 2017 9:58 PM

చిట్టిల పేరుతో డబ్బులు వసూలు చేసి ప్రజలను మోసం చేసిన ఒక వ్యక్తికి మహిళలు దేహశుద్ధి చేశారు.

తగరపువలస(విశాఖపట్టణం): చిట్టిల పేరుతో డబ్బులు వసూలు చేసి ప్రజలను మోసం చేసిన ఒక వ్యక్తికి మహిళలు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన విశాఖ జిల్లా తగరపువలసలోని కొండపేట గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన చిట్టిల నిర్వాహకుడు వెంకట్రావు పలువురి వద్ద నుంచి డబ్బులు వసూలు చేశాడు. తీరా డబ్బులు తిరిగి ఇవ్వాల్సి సమయంలో ముఖం చాటేసి తప్పించుకొని తిరుగుతున్నాడు. గురువారం రాత్రి అతన్ని పట్టుకున్న మహిళలు అతనికి దేహశుద్ధి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement