breaking news
Chitty cheater
-
చిట్టీల పేరుతో మోసం.. రూ.80 లక్షలకు టోకరా
సాక్షి, నిజామాబాద్: చిట్టీల వ్యాపారంతో ఓ నిర్వాహకుడు రూ.80 లక్షలకు టోకరా వేశారు. తీరా పెట్టుబడి పెట్టి నష్టపోయానంటూ ఐపీపెట్టాడు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. డిచ్పల్లి మండలం ధర్మారంలో జరిగిన ఘటన. వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మారం గ్రామానికి చెందిన సుమారు 50 మంది ప్రజలు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద గత కొన్నినెలలుగా చిట్టీ నిర్వహిస్తున్నారు. ఒక్కొక్కరు చిట్టీల నిర్వహణలో రూ.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకు డబ్బులు చెల్లించారు. ఇలా కొన్ని నెలల పాటు బాధితులు డబ్బులు ఇవ్వడంతో నిర్వాహకుడి వద్ద సుమారు 80 లక్షల వరకు డబ్బులు జమఅయ్యాయి. దీంతో నిర్వాహకుడు సినీ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టడంతో తీవ్రంగా నష్టపోయాడని తెలిసింది. అంతేకాకుండా ఐపీ పెట్టి కోర్టు నుంచినోటీసులు కూడా ఇప్పించాడు. దీంతో డబ్బులుకట్టిన బాధితులు ఆందోళన చెంది, గత రెండు రోజుల కిందట డిచ్ పల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. నిర్వాహకుడు కోర్టు నుంచి నోటీసులుఇచ్చాడని ఐపీ పెట్టాడని కోర్టులో తేల్చుకోవాలని స్థానిక పోలీసులు బాధితులకు తెలిపారు. దీంతో బాధితులు డబ్బులు ఇప్పించాలని సోమవారం పోలీసు కమిషనర్ కార్యాలయానికి తరలివచ్చారు. తమ డబ్బులు తమకు ఇప్పించాలని బాధితులుమొరపెట్టుకున్నారు. -
చిట్టీల పేరుతో ఘరానా మోసం
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): ‘ఆపద సమయంలో అక్కరకు వస్తాయనే భావనతో తినీతినక రూపాయి రూపాయి కూడబెట్టి చిట్టీలు కట్టాం.. రెండేళ్లు అవుతున్నా ఇంతవరకూ మా డబ్బులు తిరిగి ఇచ్చింది లేదు.. పోలీసులను ఆశ్రయించాం.. సీపీని కలిశాం.. అందరూ కలిసి మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు.. ఇప్పుడు కూడా నిందితుల తరఫున అధికార పార్టీ నేతలు మద్దతుగా వస్తున్నారే తప్ప మా గోడు పట్టించుకోవడం లేదు’ అంటూ సుమారు 16 మంది బాధితులు కొత్తపేట పోలీసులను ఆశ్రయించారు. పాల ప్రాజెక్టు సమీపంలోని రామరాజ్యనగర్ ప్రాంతానికి చెందిన ఎరువా ఏసురెడ్డి, దేవివిజయలక్ష్మి దంపతులు, మరికొందరూ 2014లో కొత్తపేట ఆంజనేయ వాగు ప్రాంతానికి చెందిన రాళ్లపూడి శ్రీనివాసరావు, తల్లి పద్మ వద్ద రూ.లక్షల్లో చిట్టీలు వేశారు. చిట్టీల వ్యవహారంలో ఏసురెడ్డి, విజయలక్ష్మి మీడియేటర్లుగా ఉండేవారు. అయితే కొంత మంది 17 నెలలు అయినా పాట పాడుకునేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో వారు విసిగిపోయారు. దీంతో తమ డబ్బులు ఇవ్వాలని ఏసురెడ్డి దంపతులపై ఒత్తిడి తీసుకువచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో 2015లో ఈ వ్యవహారంపై కొత్తపేట పోలీసులకు ఏసురెడ్డి దంపతులు ఫిర్యాదు చేయగా మరుసటి రోజు ఇరువర్గాల మధ్య రాజీ కుదిరి కేసు వెనక్కి తీసుకున్నారు. అయితే ఇంత వరకూ శ్రీనివాసరావు చిట్టీలు వేసిన వారికి డబ్బులు ఇవ్వలేదంటూ ఏసురెడ్డి దంపతులు రెండు రోజుల కిందట నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు కొత్తపేట పోలీస్ స్టేషన్‌కు చేరినా కేసులో బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేయడం మినహా పోలీసులు ముందుకు వెళ్లకపోవడంతో బాధితులు మరోమారు విషయాన్ని బహిర్గతం చేశారు. హుటాహుటిన కేసు నమోదు ఈ వ్యవహారం మీడియా ద్వారా బయటకు రావడంతో వెస్ట్ ఏసీపీ రామకృష్ణ కేసు వివరాలను సీఐ దుర్గారావు ద్వారా తెలుసుకుని కేసు నమోదు చేయాలని ఆదేశించారు. చీటింగ్ కేసు నమో దు చేసిన కొత్తపేట పోలీసులు బాధితుల వద్ద ఉన్న ఆధారాల ప్రకారం వివరాలను నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు 16 మంది బాధితులు ముందుకు రాగా మొత్తం రూ.46.50 లక్షలు చెల్లించాల్సి ఉన్న ట్లు పేర్కొన్నారు. మరో వంద మంది బాధితులు ఇంకా ఉన్నారని, మధ్యవర్తి ఏసురెడ్డి పేర్కొంటుండగా, వారందరినీ స్టేషన్‌కు వచ్చి రిపోర్టు ఇవ్వాల్సిందిగా పోలీసులు పేర్కొంటున్నారు. స్టేషన్ చుట్టూ అధికార పార్టీ నాయకులు చిట్టీల కేసులో నిందితులైన రాళ్లపూడి శ్రీనివాసరావు, అతని సోదరుడు శంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. అయితే నిందితులకు అండగా అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు స్టేషన్ ముందు వాలిపోయారు. స్థానిక డివిజన్‌తో పాటు టీడీపీ చెందిన ఓ నాయకుడు ఉదయం నుంచి పోలీస్ స్టేషన్ వద్దే పడిగాపులు కాయడం విశేషం. అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి లొంగి కేసు పక్క దారి పట్టిస్తే ఆందోళన తీవ్రతరం చేస్తామని బాధితులు హెచ్చరిస్తున్నారు. -
చిట్టిల మోసగాడికి మహిళల దేహశుద్ధి
తగరపువలస(విశాఖపట్టణం): చిట్టిల పేరుతో డబ్బులు వసూలు చేసి ప్రజలను మోసం చేసిన ఒక వ్యక్తికి మహిళలు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన విశాఖ జిల్లా తగరపువలసలోని కొండపేట గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన చిట్టిల నిర్వాహకుడు వెంకట్రావు పలువురి వద్ద నుంచి డబ్బులు వసూలు చేశాడు. తీరా డబ్బులు తిరిగి ఇవ్వాల్సి సమయంలో ముఖం చాటేసి తప్పించుకొని తిరుగుతున్నాడు. గురువారం రాత్రి అతన్ని పట్టుకున్న మహిళలు అతనికి దేహశుద్ధి చేశారు.