ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం | woman gave birth to female child in bus | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం

Dec 23 2017 8:06 PM | Updated on Dec 23 2017 8:06 PM

వేంపల్లె : బస్సులో ప్రయాణిస్తున్న నిండు గర్భిణికి నెప్పులు రావడంతో బస్సులోనే పురుడు పోసేందుకు చర్యలు తీసుకుని ఆర్టీసీ బస్సు సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్‌జిల్లా వేంపల్లె పట్టణంలో చోటుచేసుకుంది. క్రిస్మస్‌ పండగ కోసం బంధువుల ఇంటికి వెళ్లేందుకు గౌతమి అనే నిండు గర్భిణి పులివెందుల నుంచి తిరుపతి వెళుతున్న ఏపీ04జెడ్‌0131 నెంబర్‌ గల బస్సులో శనివారం ప్రయాణిస్తున్నది. ఈ క్రమంలో వేంపల్లె వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. గమనించిన బస్సు కండక్టర్‌ వేంపల్లె ప్రభుత్వాసుపత్రి సిబ్బందినకి ఫోన్‌ చేసి వారిని బస్సుకు వద్దకు పిలిపించారు. బస్సులోనే గర్భిణికి కాన్పు అయ్యేలా తగు చర్యలు తీసుకున్నారు. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆర్టీసీ సిబ్బంది తల్లీబిడ్డను వేంపల్లె ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. బస్సులోని ప్రయాణికులు సిబ్బందిని అభినందించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement