రిజిస్ట్రేషన్‌ చేయించకపోతే వాహనం సీజ్‌ | Without Registration Vehicles Sieged Soon | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్‌ చేయించకపోతే వాహనం సీజ్‌

Mar 30 2018 10:26 AM | Updated on Mar 30 2018 10:26 AM

Without Registration Vehicles Sieged Soon - Sakshi

అనంతపురం సెంట్రల్‌: శాశ్వత రిజిస్ట్రేషన్‌ చేయించని వాహనాలను త్వరలోనే సీజ్‌ చేయనున్నట్లు ఉప రవాణా కమిషనర్‌ సుందర్‌వద్దీ హెచ్చరించారు. గురువారం ఆయన రవాణాశాఖ కార్యాలయంలో జిల్లాలోని అన్ని వాహనాల డీలర్లతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 24,593 వాహనాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌లతో తిరుగుతున్నట్లు గుర్తించామన్నారు. ఏప్రిల్‌ 5వ తేదీ లోపు సీఎఫ్‌ఎస్‌టి సైట్‌ మూసివేయనున్నామనీ, దీంతో ఆ వాహనాలకు భవిష్యత్‌లో శాశ్వత రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి ఆస్కారం ఉండదన్నారు. అందువల్ల ఇంకా వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్‌ చేయించని వారంతా  ఏప్రిల్‌ 5లోపు చేయించాలన్నారు. లేకపోతే వాహనాన్ని సీజ్‌ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్టీఓ శ్రీధర్, వివిధ షోరూంల డీలర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement