మృతుడు మా ఆయనే | whereabouts of the unidentified dead body | Sakshi
Sakshi News home page

మృతుడు మా ఆయనే

Nov 5 2015 2:03 AM | Updated on Nov 6 2018 7:56 PM

మృతుడు మా ఆయనే - Sakshi

మృతుడు మా ఆయనే

గుర్తుతెలియని మృతదేహాన్ని పూడ్చుతుండగా ఆఖరి నిమిషంలో అయిన వారు రావడంతో వారికి అప్పగించిన ఘటన

బోరున విలపించిన భార్య
సాక్షి కథనంతో వెలుగులోకి వచ్చిన
గుర్తుతెలియని మృతదేహం ఆచూకీ
మృతదేహం బంధువులకు అప్పగింత  

 
కురబలకోట : గుర్తుతెలియని మృతదేహాన్ని పూడ్చుతుండగా ఆఖరి నిమిషంలో అయిన వారు రావడంతో వారికి అప్పగించిన  ఘటన మంగళవారం అంగళ్లులో జరిగింది. ముదివేడు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు.. సోమవారం ఉదయం మండలంలోని అమ్మచెరువు మిట్ట వద్దకు ఓ వ్యక్తి వచ్చి పురుగుల మందు తాగేశాడు. స్థానికులు గుర్తించి వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు. గుర్తుతెలియని శవంగా ముదివేడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం సాక్షి దినపత్రికలో మంగళవారం ఫొటోతో సహా ప్రచురితమైంది. బంధువులు ఎవరైనా వస్తారేమోనని సాయంత్రం వరకు మార్చురీలోనే శవాన్ని ఉంచారు. ఎవరూ రాకపోవడంతో పోలీసులు శవాన్ని అంగళ్లు మల్లేల గడ్డ చెరువులో పూడ్చడానికి తీసుకెళ్లారు. ఇంతలో ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఫోన్ కాల్ వచ్చింది. ‘సార్..సాక్షి పేపర్‌లో ఈ రోజు గుర్తుతెలియని వ్యక్తి పురుగుల మందు తాగి మృతిచెందినట్లు వార్త వచ్చింది .. ఆ వ్యక్తి తమ తన భర్తే’నని ఓ మహిళ తెలిపారు.

ఎక్కడున్నారంటూ ఫోన్ రావడంతో పోలీసులు శవాన్ని పక్కన పెట్టించారు. కొంత సేపటికే మృతుడి భార్య కళావతి, బంధువులు వచ్చి శవాన్ని చూసి గుర్తించారు. బోరున విలపించారు. ఈ మృతదేహం తన భర్త కృష్ణమూర్తి (41)దేనని చెప్పడంతో ఆమె నుంచి స్టేట్‌మెంట్ తీసుకుని శవాన్ని వారికి అప్పగించారు. కుటుంబ గొడవల వల్ల ఇతను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పుంగనూరు మండలం చండ్రమాకులపల్లెకు చెందిన ఇతను 15 ఏళ్లుగా మదనపల్లె నీరుగట్టువారిపల్లెలో మగ్గాలు వేస్తూ జీవనం సాగించేవాడని చెబుతున్నారు. ఇతని భార్య టీకొట్టు నిర్వహించేదని చెబుతున్నారు. సాక్షిలో ఫొటో వార్త రాకపోయి ఉంటే కడ చూపే కాదు విషయం కూడా తెలిసి ఉండేది కాదని మృతుడి బంధువుల తరపున వచ్చిన కుమ్మరి సంఘం నాయకులు అన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement