అటవీ సిబ్బందికి ఆయుధాలు

Weapons Distribute For Forest Employees - Sakshi

ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి చర్యలు

రూ.27 కోట్లతో 32 వేల హెక్టార్లలో అటవీ వనాల పెంపకం

ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ మహమ్మద్‌ ఇలియాస్‌ రిజ్వీ

విశాఖపట్నం, నర్సీపట్నం: ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించేందుకు అటవీ సిబ్బందికి  ఆయుధాలు అందజేస్తామని అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ మహమ్మద్‌ ఇలియాస్‌ రిజ్వీ తెలిపారు. గురువారం ఆయన నర్సీపట్నం అటవీ డివిజన్‌ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. అనంతరం అటవీ రేంజ్‌ కార్యాలయం వద్ద విశాఖపట్నం, విజయనగరం,శ్రీకాకుళం జిల్లాల డీఎఫ్‌వోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎర్రచందనం  అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అటవీ సిబ్బందికి 125 రివాల్వర్లను ఇప్పటికే అందజేశామన్నారు. త్వరలో 250 వరకు డబుల్‌ బార్‌ గన్స్‌ అందజేయనున్నట్టు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్న కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ముఖ్య అధి కారులతో  త్వరలో ఉమ్మడి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఎర్రచందనం రవాణా నిరోధానికి తీసుకోవలసిన చర్యలపై చర్చిస్తామన్నారు. పోలీసు, కస్టమ్స్, ఎక్సై జ్, రెవెన్యూ, అటవీశాఖ సమన్వయంతో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నిరోధిస్తామని ఆయన స్ప ష్టం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 27 శాతం  అడవుల విస్తీర్ణం ఉందని, దీనిని  33 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకు కోసం రహదారులకు ఇరువైపులా, పాఠశాలలు, కాలు వ గట్లు, ప్రతి ఇంటి ముందు మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతరించిపోతున్న అటవీ వనాల అభివృద్ధికి ప్రత్యేక ప్లాంటేషన్లు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  రాష్ట్రంలో 32 వేల హెక్టార్లలో రూ.27 కోట్లతో వనాల పెంపకం చేపడుతున్నామని వివరించారు. ఈ పర్యటనలో సీసీఎఫ్‌ రాహుల్‌పాండే పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top