హైదరాబాద్‌లో ఆంధ్రా, ఢిల్లీ పెత్తనం సహిం చేది లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు అన్నారు.
టీఆర్‌ఎస్ నేతలు జూపల్లి, స్వామిగౌడ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఆంధ్రా, ఢిల్లీ పెత్తనం సహిం చేది లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌తో కలిసి ఆయన ‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా’ విద్యార్థి సదస్సు పోస్టరు విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. సీమాంధ్ర నాయకులు దింపుడు కళ్లెం ఆశగా హైదరాబాద్‌పైన హక్కుల కోసం ఢిల్లీలో అనేక కుట్రలు చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌పై పూర్తి హక్కులున్న తెలంగాణను తెచ్చే బాధ్యత తెలంగాణ ప్రాంత మంత్రులపైనే ఉందని చెప్పారు.
చంద్రబాబు ఢిల్లీ వెళ్లి పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాస్ కాకుండా కుట్రలు చేస్తున్నాడని అన్నారు. సీమాంధ్రులు స్వత హాగా బతుకలేరని, పరాన్న జీవులను మోయలేం కాబట్టి వదిలించుకోదలిచామని స్వామిగౌడ్ అన్నారు.
ఉద్యాన విద్యార్థులకు మద్దతు: రాజేంద్రనగర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి జూపల్లి, స్వామిగౌడ్ మద్దతు పలికారు. ఈ వర్సిటీలో తెలంగాణ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని, అందులోని కీలకపదవులన్నీ తెలంగాణవారికే కేటాయించాలని వారు డిమాండ్ చే శారు.