వైఎస్సార్ సీపీని అభినందించాల్సిందే: చీఫ్‌ విప్‌ గండ్ర | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీని అభినందించాల్సిందే: చీఫ్‌ విప్‌ గండ్ర

Published Fri, Feb 7 2014 5:21 PM

వైఎస్సార్ సీపీని అభినందించాల్సిందే: చీఫ్‌ విప్‌ గండ్ర - Sakshi

హైదరాబాద్:రాజ్యసభ ఎన్నికల్లో తగినంత బలం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అభినందించాల్సిందేనని చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి తెలిపారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన గండ్ర.. పార్టీకి తగినంత బలం లేని కారణంగా వైఎస్సార్ సీపీ పోటీకి దూరంగా  ఉండటం ఆహ్వానించదగ్గ పరిణామమేనన్నారు. కాంగ్రెస్ పార్టీకి నాలుగో అభ్యర్థికి సరి పడా బలం లేని కారణంగా ముగ్గురు అభ్యర్థులతోనే పోటీకి సిద్ధమైందన్నారు.

 

తెలంగాణ ఏర్పాటు ఆలస్యమైనందున కే.కేశవరావు(కేకే) పార్టీని వీడారని గండ్ర తెలిపారు. గత అనుబంధంతోనే తమ పార్టీ ఎమ్మెల్యేలు కేకే ఓటు వేశారన్నారు. ఈ ఎన్నికకు టీఆర్ఎస్ విలీనానికి ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన పిటీషన్లును సుప్రీంకోర్టు తిరస్కరించిన తరుణంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడం సమంజసం కాదని సీమాంధ్ర నేతలకు విజ్క్షప్తి చేశారు.

 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement