పామాయిల్ లేనట్టే.. | Waiver of the class .. | Sakshi
Sakshi News home page

పామాయిల్ లేనట్టే..

Jan 3 2014 2:25 AM | Updated on Nov 9 2018 5:52 PM

పామాయిల్ లేనట్టే.. - Sakshi

పామాయిల్ లేనట్టే..

సంక్రాంతి ముంగిట సామాన్యులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నాసిరకం గోధుమపిండి పంపిణీతో విమర్శలు ఎదుర్కొంటున్న సర్కారు...

=డీడీ తీయొద్దని పౌర సరఫరాల శాఖ ఆదేశాలు
 =పిండి వంటలకు దూరంకానున్న సామాన్యులు

 
బాలసముద్రం, న్యూస్‌లైన్ : సంక్రాంతి ముంగిట సామాన్యులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నాసిరకం గోధుమపిండి పంపిణీతో విమర్శలు ఎదుర్కొంటున్న సర్కారు... తాజాగా పామారుుల్ సరఫరా చేయలేక చేతులెత్తేసింది. దీంతో పండుగ వేళ సామాన్యులకు పిండి వంటలు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పెరిగిన ధరలతో నిత్యావసర సరుకులు కొనలేక పేద, మధ్య తరగతి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రేషన్ సరుకుల్లో కోత పెడుతుండడంపై వారు మండిపడుతున్నారు.
 
డీడీ తీయకండి...
 
రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేసే అన్ని సరుకులకు సంబంధించి ప్రతి నెల 15 నుంచి 20వ తేదీ వరకు డీడీలు చెల్లించాలి. అయితే జనవరి కోటాకు సంబంధించి పామాయిల్ మినహా మిగిలిన వస్తువులకు డీడీలు తీయాలంటూ రేషన్ డీలర్లకు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ చివరి నిమిషంలో అయినా... పరిస్థితిలో మార్పు వస్తుందని అంతా ఎదురుచూశారు. అయితే అధికారుల నుంచి ఎటువంటి సమాచారం లేదు. ఈ నేపథ్యంలో ఈ నెలలో పామాయిల్  సరఫరా కష్టమేనని తెలుస్తోంది.
 
గత నెలలోనూ కోతే...
 
జిల్లాలో ప్రభుత్వం ప్రతి నెలా 2,113 రేషన్ దుకాణా ల ద్వారా  9.80 లక్షల పామారుుల్ ప్యాకెట్లను పేదలకు అందజేస్తోంది. గతనెలలో పూర్తి కోటా ప్రకారం పామాయిల్‌ను సరఫరా చేయలేదు.  అరవై శాతం కో తతో కేవలం 3.98 లక్షల ప్యాకెట్లు సరఫరా చేసింది. తాజాగా ఈ నెలలో మొత్తం కోటాకు కోత పెట్టింది.
 
నాసిరకం గోధుమపిండి, చింతపండు

 
రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న తొమ్మిది వస్తువుల్లోగోధుమపిండి పూర్తిగా నాసిరకంతో ఉం టోంది. పురుగులతో కూడిన పిండిని కొనుగోలు చేసేందుకు రేషన్ లబ్ధిదారులు జంకుతున్నారు. దీం తో కొన్ని నెలలుగా రేషన్ షాపుల్లో నిల్వలు పేరుకుపోయూయి. దీనికి సంబంధించి జనవరి కోటాలో 30 శాతం మేరకు మాత్రమే డీడీలు వచ్చాయి. చింతపండుదీ ఇదే పరిస్థితి. రేషన్ దుకాణాల్లో  చింతపండు అమ్మకం 10 శాతం దాటడం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement