కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ పొత్తు ధర్మం పాటించట్లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యానించారు.
విష్ణుకుమార్‌రాజు
విశాఖ సిటీ: కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ పొత్తు ధర్మం పాటించట్లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం విశాఖలో విలేకరులతో మాట్లాడారు. పొత్తు కుదరక ముందు 23 డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని, అయితే టీడీపీ పెద్దలతో కలసి సీట్ల పంపకాలపై చర్చలు జరిపాక కుదిరిన పొత్తు ఒప్పందం మేరకు తొమ్మిది స్థానాల్లోనే అభ్యర్థుల్ని ఉంచామని తెలిపారు.
మిగిలిన 14 స్థానాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించారని చెప్పారు. కానీ ఈ 9 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించకుండా పొత్తు ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించారని విమర్శించారు.