ప్రపంచ చాంపియన్‌గా విశాఖ బాలుడు | Visakhapatnam boy shines in the Rhymes World Cup | Sakshi
Sakshi News home page

ప్రపంచ చాంపియన్‌గా విశాఖ బాలుడు

Jun 16 2017 11:04 AM | Updated on Sep 5 2017 1:47 PM

ప్రపంచ చాంపియన్‌గా విశాఖ బాలుడు

ప్రపంచ చాంపియన్‌గా విశాఖ బాలుడు

పిట్ట కొంచెం కూత ఘనమని నిరూపించాడు విశాఖకు చెందిన మూడేళ్ల బాలుడు.

సీతంపేట (విశాఖ ఉత్తరం): పిట్ట కొంచెం కూత ఘనమని నిరూపించాడు విశాఖకు చెందిన మూడేళ్ల బాలుడు. మాటలు కూడా సరిగా రాని వయసులో అనర్గళంగా రెండు వందలకు పైగా ఇంగ్లిష్‌ రైమ్స్‌ను అలవోకగా చెప్పేస్తున్నాడు అభిజిత్‌ దేవాన్ష్‌. లయబద్ధంగా పాడుతూ దానికి తగినట్టు హావభావాలు ప్రదర్శిస్తూ రైమ్స్‌ చెప్పడం అభిజిత్‌ ప్రత్యేకత. ఈ టాలెంటే ఆ బుడతడిని ప్రపంచ చాంపియన్‌ను చేసింది.

రైమ్స్‌ వరల్డ్‌ కప్‌ సంస్థ ఇటీవల మలేసియాలో నిర్వహించిన వరల్డ్‌కప్‌ పోటీల్లో అభిజిత్‌ మొదటి స్థానంలో నిలిచి విశాఖ కీర్తి పతాకం ఎగురవేశాడు. 20 దేశాల నుంచి 180 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనగా ఈ చిన్నారి జూనియర్‌ విభాగంలో మొదటి స్థానం దక్కించుకున్నాడు. ఈ నెల 11న మలేసియాలో జరిగిన రైమ్స్‌ వరల్డ్‌ కప్‌ పోటీలో జూనియర్‌ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి వరల్డ్‌ టైటిల్‌ విన్నర్‌ అయ్యాడు. అభిజిత్‌ విశాఖ టింపనీ స్కూల్‌లో ఎల్‌కేజీలో చేరాడు. తండ్రి పి.శివకుమార్‌ ఏసీబీలో పనిచేస్తుండగా.. తల్లి జయలక్ష్మి ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తున్నారు.

Advertisement

పోల్

Advertisement