'ప్రజలు ఎదురు తిరిగే రోజులు వచ్చాయి' | vijaysai reddy visits to the jagans diksha stadium in tanuku | Sakshi
Sakshi News home page

'ప్రజలు ఎదురు తిరిగే రోజులు వచ్చాయి'

Jan 29 2015 5:20 PM | Updated on Jul 25 2018 4:09 PM

'ప్రజలు ఎదురు తిరిగే రోజులు వచ్చాయి' - Sakshi

'ప్రజలు ఎదురు తిరిగే రోజులు వచ్చాయి'

పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు లో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న రైతు దీక్ష ఏర్పాట్లను గురువారం వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పరిశీలించారు.

హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు లో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న రైతు దీక్ష  ఏర్పాట్లను గురువారం వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శనివారం ఉదయం 10 గంటలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షను ప్రారంభిస్తారని తెలిపారు. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు దీక్ష కొనసాగుతుందన్నారు. రైతు దీక్షకు ప్రజలు భారీగా తరలి వచ్చి మద్దతు పలకాలని ఆయన కోరారు.

వెన్నుపోటు పొడవడం అనేది చంద్రబాబు నాయుడు నైజమని విజయసాయి రెడ్డి విమర్శించారు. అధికారం కోసం ఆనాడు ఎన్టీఆర్ ను, నేడు ప్రజలను వెన్నుపోటు పొడిచారని ఆయన మండిపడ్డారు. మోసపూరిత వాగ్ధానాలపై ప్రజలు ఎదురు తిరిగే రోజులు వచ్చాయన్నారు. ఎన్నికల మేనిఫెస్టో అమలు చేసే వరకు ప్రజలకు వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ, టీడీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేసి రైతులు, డ్వాక్రా మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల దీక్ష చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement