శ్రీకాకుళం జిల్లాలో పై-లీన్ తుపాను కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో పర్యటించి, బాధితులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్
‘విజయమ్మకు ఘన స్వాగతం పలుకుదాం
Oct 16 2013 1:40 AM | Updated on Jan 7 2019 8:29 PM
సాక్షి, విశాఖపట్నం: శ్రీకాకుళం జిల్లాలో పై-లీన్ తుపాను కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో పర్యటించి, బాధితులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ బుధవారం నగరానికి రానున్నారు. విశాఖ విమానాశ్రయంలో ఉదయం 7.30 గంటలకు విజయమ్మకు ఘనస్వాగతం పలికేందుకు నగరంలోని పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరావాల్సిందిగా పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆమె రోడ్డు మార్గంలో శ్రీకాకుళం చేరుకుని తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తారన్నారు.ఆటో ర్యాలీని విజయవంతం చేయండి: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్ర సాధనే లక్ష్యంగా కృషి చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు గురువారం ఉదయ ఆటో ర్యాలీ నిర్వహించనున్నట్టు నగర కన్వీనర్ తెలిపారు. నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో సమన్వయకర్తల ఆధ్వర్యంలో వార్డుల వారీ పార్టీ శ్రేణులు ఈ ర్యాలీలో పాల్గొంటాయన్నారు.
Advertisement
Advertisement