విజయలక్ష్మి నిద్రలోనే చనిపోయారు | Vijaya laxmi dies in sleep after takes sleeping pills | Sakshi
Sakshi News home page

విజయలక్ష్మి నిద్రలోనే చనిపోయారు

Dec 6 2013 2:12 AM | Updated on Nov 6 2018 7:53 PM

తండ్రిలేని లోకంలో జీవించలేనంటూ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్న నిమ్స్ కార్డియాలజీ విభాగం అధిపతి డాక్టర్ శేషగిరిరావు భార్య డి.విజయలక్ష్మి నిద్రలోనే చనిపోయినట్లు శవపరీక్షలో వెల్లడైంది.

నిద్ర మాత్రలు మింగి మృతి.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
 హైదరాబాద్, న్యూస్‌లైన్: తండ్రిలేని లోకంలో జీవించలేనంటూ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్న నిమ్స్ కార్డియాలజీ విభాగం అధిపతి డాక్టర్ శేషగిరిరావు భార్య డి.విజయలక్ష్మి నిద్రలోనే చనిపోయినట్లు శవపరీక్షలో వెల్లడైంది.  ఆ నివేదికను ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు గురువారం వెల్లడించారు. ఆమె ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని తేల్చారు. గత నెల 28వ తేదీన సుమారు 20 నిద్ర మాత్రలు మింగిన విజయలక్ష్మి.. తమ నివాసం స్టోర్ రూంలో లోపలి నుంచి గడియ వేసుకొని పడుకున్నారు. రెండు రోజుల అనంతరం నిద్రలోనే ఆమె ప్రాణాలు పోయాయని వైద్య పరీక్షల్లో తేలింది. ఆమె కడుపులో తెల్లని పదార్థాన్ని గుర్తించిన వైద్యులు అది నిద్రమాత్రలదేనని స్పష్టం చేశారు. గత నెల 30వ తేదీన ఆమె మరణించి ఉంటుందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement