ఆస్తుల కేసులో రెండో నిందితుడైన విజయసాయిరెడ్డి.. బెయిల్ కోసం సీబీఐ కోర్టులో దరఖాస్తు చేశారు.
	ఆస్తుల కేసులో రెండో నిందితుడైన విజయసాయిరెడ్డి.. బెయిల్ కోసం సీబీఐ కోర్టులో దరఖాస్తు చేశారు. ఇదే కేసులో వైఎస్ జగన్మోహనరెడ్డి బెయిల్పై విడుదలైన సరిగ్గా ఒక రోజు తర్వాత ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. చంచల్గూడ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆయన.. తన న్యాయవాది ద్వారా బెయిల్ దరఖాస్తు పంపారు.
	
	జగన్ సంస్థలకు ఆర్థిక సలహాదారుగా వ్యవహరించిన ఆయన.. జగన్కు బెయిల్ రావడంతో దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. విజయ సాయి రెడ్డిపై దాఖలుచేసిన ఏ కేసులోనూ విచారణ ప్రారంభం కాలేదని, అది మరింత ఆలస్యమయ్యేలా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రయోజనాల దృష్ట్యా బెయిల్పై విడుదల చేయాలని పిటిషన్లో కోరారు. సుప్రీంకోర్టు సీబీఐకి విచారణ కోసం ఇచ్చిన గడువు కూడా ఈనెల 8వ తేదీతోనే ముగిసిన విషయాన్ని ఆయన బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డి కూడా నిన్నే బెయిల్ కోసం దరఖాస్తు చేశారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
