నెల్లూరు నగరంలోని పప్పుల వీధిలో ఉన్న రెండు దుకాణాలపై సోమవారం విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు.
నెల్లూరు టౌన్ : నెల్లూరు నగరంలోని పప్పుల వీధిలో ఉన్న రెండు దుకాణాలపై సోమవారం విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. వీధిలోని శరాబ్ పెదవోగయ్య అండ్ సన్స్, హరినాయుడు కేడర్ దుకాణాలపై అధికారులు దాడులు జరిపారు.
ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 63లక్షల 24వేలు విలువ చేసే పప్పు దాన్యాలను వారు గుర్తించారు. రెండు దుకాణాలపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారులు తెలిపారు.