రేషన్ షాపులపై విజిలెన్స్ దాడులు | Vigilance Department officials conduct raid at ration shops | Sakshi
Sakshi News home page

రేషన్ షాపులపై విజిలెన్స్ దాడులు

Aug 7 2013 12:39 AM | Updated on Sep 1 2017 9:41 PM

పౌరసరఫరాల శాఖ ద్వారా నిరుపేదలకు పంపిణీ చేయాల్సిన సరుకులను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదులపై రెవెన్యూ అధికారులు స్పందించారు.

సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: పౌరసరఫరాల శాఖ ద్వారా నిరుపేదలకు పంపిణీ చేయాల్సిన సరుకులను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదులపై రెవెన్యూ అధికారులు స్పందించారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలో చౌకధరల దుకాణాలపై విజిలెన్స్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అకస్మిక దాడులు నిర్వహించారు. షాప్ నం4 డీలర్ కృష్ణమూర్తి, రాజంపేటలోని షాప్ నం6 డీలర్ గొట్టి ముక్కుల శివానందం, షాప్ నం15 డీలర్ భూపాల్‌లు నిత్యవసర సరుకులను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్టు ఫిర్యాదు రావడంతో తనిఖీలు చేసినట్టు తెలిపారు. షాపులో ఉన్న అక్రమ నిల్వలను సీజ్ చేసి నివేదికలను జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలకు సమర్పించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు ముగ్గురు డీలర్లపై కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. సీఐతో పాటు తహశీల్దార్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement