విజిలెన్స్‌ తనిఖీలు.. పెట్రోల్‌ బంక్‌ సీజ్‌ | Vigilance Attacks on Petro; Bunk | Sakshi
Sakshi News home page

విజిలెన్స్‌ తనిఖీలు.. పెట్రోల్‌ బంక్‌ సీజ్‌

Nov 23 2018 7:29 AM | Updated on Nov 23 2018 7:29 AM

Vigilance Attacks on Petro; Bunk - Sakshi

కన్నాపురం అడ్డరోడ్డు వద్ద ఉన్న పెట్రోల్‌ బంక్‌

పశ్చిమగోదావరి, పోలవరం రూరల్‌: పోలవరం మండలం కన్నాపురం అడ్డరోడ్డు వద్ద ఉన్న భారత్‌ పెట్రోల్‌ బంక్‌ను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీ చేశారు. బంక్‌లో నాణ్యతా ప్రమాణాలు, రికార్డు, స్టాకు, వసతులను క్షుణ్ణంగా పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా విజిలెన్స్‌ సీఐ జీవీవీ నాగేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ బి.అచ్యుతరావు ఆదేశాల మేరకు తనిఖీ చేయడం జరిగిందన్నారు. బంక్‌లో పెట్రోల్‌ 138 లీటర్లు ఎక్కువ ఉన్నట్లు గుర్తించామన్నారు. 6ఎ కేసు నమోదు చేసి బంక్‌ సీజ్‌ చేయడం జరిగిందన్నారు. బంక్‌లో పెట్రోల్‌ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉందన్నారు. బంక్‌లపై ఫిర్యాదులు కూడా వస్తున్నాయని పేర్కొన్నారు.

కొలతల ప్రకారం డీజిల్, పెట్రోల్‌ పరిశీలించామన్నారు. పెట్రోల్‌లో కల్తీ ఉన్నాయా లేదా అనేది పరిశీలించడం కోసం శాంపిల్స్‌ కూడా సేకరించామన్నారు. రికార్డులు కూడా సక్రమంగా లేవని తెలిపారు. బంక్‌లో భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు కూడా పాటించడం లేదని తెలిపారు. బంక్‌లో మెయింటెనెన్స్, కండీషన్స్‌ అన్ని పరిశీలించామన్నారు. జేసీ కోర్టుకు కేసు తీసుకువెళతామని అప్పటివరకు బంక్‌ సీజ్‌ చేయడం జరుగుతుందన్నారు. బంక్‌ను ఏఎస్‌ఓకు అప్పగించినట్టు తెలిపారు. ఈ తనిఖీలో ఏజీ జి.జయప్రసాద్, ఏఎస్‌ఓ పి.భాస్కరరావు, పోలవరం సీఎస్‌డీటీ షేక్‌ సలీమ్, హెచ్‌సీ వెంకటేశ్వరరావు వీఆర్‌ఓ ఎ.సాయికృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement