ఒంటరితనాన్ని భరించలేక పాతతరం సినీనటుడు కుమార్తె ఒకరు ఆత్మహత్య చేసుకున్నరు.
హైదరాబాద్ : ఒంటరితనాన్ని భరించలేక పాతతరం సినీనటుడు కుమార్తె ఒకరు ఆత్మహత్య చేసుకున్నరు. బంజారాహిల్స్ ఎస్ఐ భాస్కరరావు కథనం ప్రకారం ఫిలింనగర్ రోడ్డు నెం.7లోని ఫేజ్-2లో పాతతరం నటుడు సీపీ కృష్ణారావు కుమార్తె ఎన్.ధనలక్ష్మి (50) నివాసముంటున్నారు. ఆరేళ్ల క్రితం ఈమె భర్త ఎన్.నరేందర్ మృతి చెందారు.
మరో రెండు రోజుల్లో ఇతని వర్థంతిని నిర్వహించాల్సి ఉంది. ఏడాది క్రితం ఇద్దరు కొడుకుల పెళ్లిళ్లు చేయగా వారు వేరుగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా...శుక్రవారం మధ్యాహ్నం ధనలక్ష్మి తన ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అటు భర్తను కోల్పోవటం, ఇటు పిల్లలు దూరంగా ఉండటంతో ఒంటరితనంతో ధనలక్ష్మి కొంతకాలంగా ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తోందని, ఈ నేపథ్యంలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.