జాషువా ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి

Vellampalli Srinivasa Rao Speech In Vijayawada About Gurram Jashuva - Sakshi

దేవదాయ శాఖ మంత్రి  వెలంపల్లి శ్రీనివాసరావు 

సాక్షి, సూర్యారావుపేట: సామాజిక మార్పు కోసం ఎంతో కృషి చేసిన మహాకవి జాషువా ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు.  మహాకవి గుర్రం జాషువా 124వ జయంతిని పురస్కరించుకుని బందరురోడ్డులోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జాషువా సాంస్కృతి వేదిక, తెలుగు షార్ట్‌ఫిలిం అసోసియేషన్,సుమదుర కళానికేతన్‌ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజలు పాటు  నిర్వహించిన రాష్ట్రస్థాయి షార్ట్‌ ఫిలింపోటీల విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి  మాట్లాడుతూ  ఔత్సాహిక షార్ట్‌ ఫిలిం మేకర్స్‌కు జాషువా సాంస్కృతిక వేదిక మంచి అవకాశం కల్పి స్తుందన్నారు.

సినీ దర్శకుడు రేలంగి నరసిం హారావు మాట్లాడుతూ షార్ట్‌ ఫిలిమ్‌ తీస్తున్న యువత అభ్యుదయ భావాలతో ఎంతో ముం దున్నారని తెలిపారు. తెలుగు వారి మేధస్సును అమెరికా లాంటి  విదేశాలు ఎక్కువగా విని యోగించుకుంటున్నాయని పేర్కొన్నారు. అమరావతి బాలోత్సవం కమిటీ గౌరవాధ్యక్షుడు చలవాది మల్లిఖార్జునరావు, సుమదుర కళానికేతన్‌ కార్యదర్శి పి.విజయకుమార్‌ శర్మ, షార్ట్‌ ఫిలిమ్‌ అసోషియేషన్‌ కార్యదర్శి డి.వి. రాజు తదితరుల ప్రసంగించారు. అనంతరం ఉత్తమ చిత్రాలకు  మంత్రి చేతుల మీదుగా నగదు బహుమతి,మెమోంటో, ప్రశం సా పత్రాలను  అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గుండు నారాయణరావు,ప్రసాద్,నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ చిత్రాలు 
మొదటి ఉత్తమ చిత్రంగా పద్మాలయ ప్రొడక్షన్‌ వారి ఆడపిల్ల నిలిచింది. 2వ ఉత్తమ చిత్రం మాతృదేవో భవ, 3వ ఉత్తమ చిత్రం కోయిలమ్మ పిల్లలు నిలిచాయి. వీరికి నగదు నగదు బహుమతితో పాటు జాపిక, సర్టిఫికేట్‌లను అందజేశారు. పోటీలో పాల్గొన్న ఫిలిమ్‌ మేకర్స్‌కు జ్ఞాపిక,ప్రశంసాపత్రం అందించారు.

ఆదర్శనీయం..  జాషువా జీవితం 
గాంధీనగర్‌: నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువా జీవితం నుంచి నేటి యువత ఎంతో నేర్చుకోవాల్సి ఉందని సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు తానేటి వనిత అన్నారు. శుక్రవారం హోటల్‌ ఐలాపురంలో డ్రీమ్‌ స్వచ్ఛంద సేవా సంస్థ, సామాజిక సాధికారత కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో గుర్రం జాషువా 125వ జయంతి వేడుకలు జరిగాయి.    సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ఆధునిక కవులలో గుర్రం జాషువాను మించిన వారులేరన్నారు. విజయవాడ రూరల్‌ ఎంఈవో ఆదూరి వెంకటరత్నం జాషువా రచించిన పద్యాలను ఆలపించారు. డ్రీమ్‌ స్వచ్చంద సేవా సంస్థ చైర్మన్‌ మేదర సురేష్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో సినీ రాజకీయ విమర్శకుడు కత్తి మహేష్, తెలుగు సాహిత్య అకాడమీ చైర్మన్‌ కొలకలూరి ఇనాక్,  వైఎస్సార్‌సీపీ నాయకులు కాలే పుల్లారావు, సిరిపురపు గ్రిటన్, జాషువా మునిమనువడు పవన్‌ కుమార్, తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top