'సీఎం కార్యాలయం మార్చాల్సిందే' | Vaastu effect: Chandrababu Naidu may shift to 'L' block | Sakshi
Sakshi News home page

'సీఎం కార్యాలయం మార్చాల్సిందే'

May 26 2014 12:46 PM | Updated on Aug 15 2018 9:20 PM

రాజకీయ నేతలు వాస్తు నమ్మకాలు అధికారులను పరుగులు పెట్టిస్తున్నాయి.

హైదరాబాద్ : రాజకీయ నేతలు వాస్తు నమ్మకాలు అధికారులను పరుగులు పెట్టిస్తున్నాయి. నిన్న కేసీఆర్... తాజాగా చంద్రబాబు నాయుడు వాస్తు నమ్మకాలతో అధికారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దాంతో  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సచివాలయ ఏర్పాటు వ్యవహారం మళ్లీ మొదటికే వచ్చింది. హెచ్ బ్లాక్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న  సీఎం కార్యాలయం ఏర్పాటుపై చంద్రబాబు నాయుడు వాస్తు నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

హెచ్ బ్లాక్ వాస్తుకు అనుకూలంగా లేనందున ముఖ్యమంత్రి కార్యాలయం మార్చాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు. దాంతో విధిలేని పరిస్థితుల్లో ఎల్ బ్లాక్ను ఆంధ్రప్రదేశ్ సీఎం కార్యాలయంగా అధికారులు మార్పులు చేస్తున్నారు. ఎల్ బ్లాక్లోని 7, 8 అంతస్తులను చంద్రబాబు కార్యాలయం కోసం కేటాయించటం జరిగింది. దీంతో ఎల్ బ్లాక్లో సీఎం కార్యాలయ ఏర్పాటుకు పనులు ప్రారంభించాలని ప్రభుత్వం ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ శాఖను ఆదేశించింది. వాస్తు ఎఫెక్ట్తో తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ బేగంపేట సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లేందుకు విముఖత చూపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement