బంగారు విజేత..మన ఉషమ్మ

Usharani The Jaint Killer Of Palakollu Constituency  - Sakshi

సాక్షి, పాలకొల్లు : పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 12సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాల అభ్యర్థులు సత్తాచాటారు. 2009లో శాసనసభ  ఎన్నికల్లో బంగారు ఉషారాణి అద్భుత విజయాన్ని నమోదు చేసి నియోజకవర్గం నుంచి చట్టసభల్లోకి కాలుమోపిన ఏకైక మహిళగా రికార్డులకెక్కారు. అప్పట్లో మెగాస్టార్‌ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఇక్కడి నుంచి పోటీ చేశారు. సినీనటుడు కావడంతో ప్రజారాజ్యం పార్టీకి మంచి గాలి ఉంటుందని అందరూ భావించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాజకీయ చాతుర్యం ప్రదర్శించి మైనార్టీ ఓట్లు కలిగిన వైశ్య సామాజిక వర్గానికి చెందిన బంగారు ఉషారాణిని మెగాస్టార్‌ చిరంజీవిపై పోటీకి నిలబెట్టారు. ఆ ఎన్నికల్లో చిరంజీవిని ఓడించి ఉషారాణి అనూహ్య విజయం సాధించారు. దీంతో అందరూ ఆమెను జెయింట్‌ కిల్లర్‌గా అభివర్ణించారు.     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top