కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
సాక్షి, విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. కేంద్ర చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ సహకారంతో అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్(ఎలిప్) సంస్థ ఇంటిగ్రేటెడ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కింద మహిళలకు నైపుణ్యం పెంపుదలపై శిక్షణ ఇచ్చింది.
ఆదివారం విజయవాడ ఎన్‌ఏసీ కల్యాణమండపంలో ఎలిప్ వందేమాతరం-జెండర్ సమానత్వం కార్యక్రమంలో స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలని, అందుకోసమే పేదలకు ప్రభుత్వం ఇచ్చే ఇళ్లు మహిళల పేరుతోనే టైటిల్ డీడ్ ఇస్తున్నామన్నారు.