పెళ్లి ఇంట విషాదం | Two women killed in road accident | Sakshi
Sakshi News home page

పెళ్లి ఇంట విషాదం

Mar 25 2016 4:42 AM | Updated on Aug 30 2018 4:07 PM

పెళ్లి ఇంట విషాదం - Sakshi

పెళ్లి ఇంట విషాదం

నెల్లూరులోని నవాబుపేటలోని బంగ్లాతోటకు చెందిన శ్రీరాములు, పద్మజ దంపతుల కువూర్తె సమతకు బుధవారం ....

రోడ్డు ప్రమాదంలో
ఇద్దరు మహిళల మృతి మరో ఇద్దరికి
తీవ్ర గాయూలుపరిస్థితి విషమం

 
 
 శ్రీకాళహస్తి రూరల్ :  నెల్లూరులోని నవాబుపేటలోని బంగ్లాతోటకు చెందిన శ్రీరాములు, పద్మజ దంపతుల కువూర్తె సమతకు బుధవారం రాత్రి తిరుచానూరులోని సింధూర కల్యాణ వుండపంలో పెళ్లి జరిగింది. కొత్త దంపతులు తిరిగింపులకు వస్తారని, తగిన ఏర్పాట్లు చేసేం దుకు గురువారం తెల్లవారుజావుున  శ్రీరాములు, పద్మజ, శ్రీరాములు పెద్దవ్ము సంపూర్ణమ్మ, పిన్ని అనసూయుమ్మ కారులో నెల్లూరుకు బయులుదేరారు. కారును శ్రీరములు నడిపాడు. శ్రీకాళహస్తి వుండలం పూతలపట్టు- నాయుుడుపేట రోడ్డులోని తొండవునాడు వులుపు వద్ద వుుందు వెళుతున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే సమయం లో ఎదురుగా వురో వాహనం వచ్చిం ది. దాన్ని తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొని పంటపొలాల్లోకి బోల్తా పడింది. పద్మజ(40), సంపూర్ణమ్మ(56) అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీరాములు(45), అనసూయుమ్మ(54) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సవూచారంతో ఎస్‌ఐ శ్రీకాంత్ అక్కడికి చేరుకుని తీవ్రంగా గాయపడిన శ్రీరాములు, అనసూయమ్మను 108లో శ్రీకాళహస్తి ఏరియూ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషవుంగా ఉండడంతో తిరుపతి రుయూకు తరలించారు. పద్మజ, సంపూర్ణవ్ము మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియూ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.  
 
 
 అప్పటి వరకు కుటుంబ సభ్యు లు, బంధువులతో ఆ ఇళ్లు కళకళలాడింది. కుమార్తె పెళ్లిని ఘనంగా చేశారు. తిరిగింపులకు వచ్చే కొత్త దంపతులు, బంధువులకు మర్యాదలు చేయాలని ఇంటికి బయలుదేరిన వారిని విధి వెం టాడింది. రోడ్డు ప్రమాదంలో పెళ్లి కు మార్తె తల్లి, అవ్వ మృతిచెందారు. పెళ్లి కుమార్తె తండ్రి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement