తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రఘుదేవపురంలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ప్రహరీ గోడ కూలి ఇద్దరు వృద్ధులు మృత్యువాతపడ్డారు.
సీతానగరం : తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రఘుదేవపురంలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ప్రహరీ గోడ కూలి ఇద్దరు వృద్ధులు మృత్యువాతపడ్డారు. గ్రామానికి చెందిన ఎర్రగోగుల మంగతాయారు (72), నిడదవోలు సూర్యకాంతం (75)లు ఇంటి ప్రహరీ గోడ పక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. దెబ్బతిని ఉన్న ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలి వారిపై పడిపోయింది. తీవ్రంగా గాయపడిన వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.