పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ వద్ద శుక్రవారం సముద్ర సాన్నానికెళ్లిన ఇద్దరు మృత్యువాత పడ్డారు.
పశ్చిమ గోదావరి (మొగల్తూరు) : పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ వద్ద శుక్రవారం సముద్ర సాన్నానికెళ్లిన ఇద్దరు మృత్యువాత పడ్డారు. నర్సాపురం మండలం రాయిపేటకు చెందిన గంగాధర ముర ళీకృష్ణ(35), రాకేష్ కాశి(18)లు ప్రమాదవశాత్తు మరణించారు.
మురళీకృష్ణ బెంగుళూరులోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, రాకేష్ స్థానికంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.