లారీ దూసుకెళ్లి.. ఇద్దరు చిన్నారుల దుర్మరణం | two children died after lorry crash into house | Sakshi
Sakshi News home page

లారీ దూసుకెళ్లి.. ఇద్దరు చిన్నారుల దుర్మరణం

Dec 20 2013 5:49 PM | Updated on Aug 30 2018 3:56 PM

జిల్లాలోని తాడిపత్రిలో శుక్రవారం ఓ విషాదం చోటుచేసుకుంది. అతివేగంతో వస్తున్న ఓ లారీ అదుపుతప్పి రోడ్డుప్రక్కనే వున్నఇంట్లోకి దూసుకెళ్లింది.

అనంతపురం: జిల్లాలోని తాడిపత్రిలో శుక్రవారం ఓ విషాదం చోటుచేసుకుంది. అతివేగంతో వస్తున్న ఓ లారీ అదుపుతప్పి రోడ్డుప్రక్కనే వున్నఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో రెండు పసిప్రాణాలు గాలిలో కలిసిపోయ్యాయి. అతడు నిర్లక్ష్యంగా లారీ నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

కాగా, స్థానికులు డ్రైవర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement