విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని రెండెకరాల విస్తీర్ణంలో ఉన్న వరహాలగడ్డను ఆక్రమించుకున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పార్వతీపురం : విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని రెండెకరాల విస్తీర్ణంలో ఉన్న వరహాలగడ్డను ఆక్రమించుకున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయడు, టీడీపీ నాయకుడు అయిన బొంగు జోగినాయుడుతోపాటు మర్రాపు నారాయణస్వామిలను అరెస్ట్ చేసినట్టు మంగళవారం సాయంత్రం ఎస్‌ఐ బి.అశోక్‌కుమార్ తెలిపారు.
వరహాలగడ్డ ఆక్రమణలను 'సాక్షి' దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. అధికారులు స్పందించినట్టే స్పందించి చర్యల విషయంలో వెనక్కి తగ్గడంతో... కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు నిందితులను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.