మూడు కోణాల్లో అనుమానాలు...: పరకాల | tulluru villages:We suspect that in three dimensions, says parakala prabhakar | Sakshi
Sakshi News home page

మూడు కోణాల్లో అనుమానాలు...: పరకాల

Dec 29 2014 12:31 PM | Updated on Oct 1 2018 2:00 PM

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో రాజధాని ప్రాంత గ్రామాలలో పంటలు తగులపెట్టిన ఘటనలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ స్పష్టం చేశారు.

హైదరాబాద్ : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో రాజధాని ప్రాంత గ్రామాలలో పంటలు తగులపెట్టిన ఘటనలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి  అధికారులను  పూర్తి నివేదిక కోరినట్లు చెప్పారు.

ఆయన సోమవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నామని, పంట నష్టంపై కచ్చితమైన సమాచారం లేదని, సాయంత్రంలోగా ఒక స్పష్టత వస్తుందని అన్నారు.  లేదని అన్నారు. పంట కావాలనే తగులబెడితే కఠిన చర్యలు తప్పవని పరకాల తెలిపారు.

మూడు కోణాల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని...ఆ దిశల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.  మొత్తం 15మంది రైతులకు చెందిన పొలాలు దగ్దం అయ్యాయని పరకాల తెలిపారు. తాడేపల్లి మండలంలో ఎక్కువ నష్టం జరిగిందన్నారు. పూర్తిస్థాయిలో దర్యాప్తుకు ముఖ్యమంత్రి ఆదేశించినట్లు పరకాల వెల్లడించారు. మరోవైపు తగులబడిన పంటలను జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే పర్యటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement