టీటీడీ పాలక మండలి సమావేశం రద్దు | TTD Palaka mandali meeting cancellation due to assembly | Sakshi
Sakshi News home page

టీటీడీ పాలక మండలి సమావేశం రద్దు

Jan 24 2014 11:37 AM | Updated on Sep 2 2017 2:57 AM

నేడు తిరుమలలో జరగవలసిన పాలక మండలి సమావేశం రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుక్రవారం ఇక్కడ వెల్లడించింది.

నేడు తిరుమలలో జరగవలసిన పాలక మండలి సమావేశం రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుక్రవారం ఇక్కడ వెల్లడించింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వివరించింది. మరల ఎప్పుడు సమావేశం నిర్వహించేది త్వరలో తేదీ ఖరారు చేస్తామని తెలిపింది.

 

అసెంబ్లీ సమావేశాలు నిన్న గురువారం అంటే 23తో ముగియాల్సి ఉంది. అయితే రాష్ట్ర విభజనపై చర్చించేందుకు మరో వారం రోజుల పాటు రాష్ట్రపతి గడువు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ మరో వారం పాటు జరగనుంది. రాష్ట్ర అసెంబ్లీలోని కొంత మంది ఎమ్మెల్యేలు టీటీడీ పాలకమండలిలో సభ్యులుగా ఉన్న సంగతి తెలిసిందే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement