తెలంగాణ రాష్ట్ర సమితి సీని యర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు ఏ.చంద్రశేఖర్ ఎట్టకేలకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా : తెలంగాణ రాష్ట్ర సమితి సీని యర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు ఏ.చంద్రశేఖర్ ఎట్టకేలకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వైఖరి వల్లే తాను పార్టీకి రాజీ నామా చేస్తున్నట్లు గత వారం ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే.
పార్టీ ఆవిర్భావం అనంతరం 2004 ఎన్నికలకు ముందు ఏసీఆర్ టీఆర్‌ఎస్‌లో చేరారు. 2004 ఎన్నికల్లో గెలుపొంది మంత్రి పదవి చేపట్టారు. తెలంగాణపై కాంగ్రెస్ నాన్చుడు ధోరణి ప్రదర్శించడం తో పదవికి రాజీనామా చేసిన ఏసీఆర్.. 2008 ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లోనూ ఓట మిపాలయ్యారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో కీలక భూమి క పోషించారు. తెలంగాణ ఇస్తే.. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్ ఇచ్చిన మాట తప్పడంతో తాను ఆవేదనతో పార్టీని వీడుతున్నట్లు ప్రకటించా రు. తాజాగా ఆయన చేరికతో కాంగ్రెస్ లో, ముఖ్యంగా వికారాబాద్ రాజకీయాల్లో సమీకరణాలు మారనున్నాయి.