
‘అన్నా.. నాకు పదో తరగతిలో 9.5 గ్రేడ్ వచ్చింది. ట్రిపుల్ ఐటీలో సీటు ఇవ్వలేదు’ అని మామిడివానిపాలేనికి చెందిన పీలా ఐశ్వర్య పాదయాత్రలో జననేత జగన్‌ను కలసి కన్నీటి పర్యంతమైంది. ‘రెండు సార్లు కౌన్సెలింగ్‌కు రమ్మన్నారు. రెండో సారి వెళ్లాక కౌన్సెలింగ్ రద్దయింది అని చెప్పి వెనక్కి పంపించేశారు. రాజకీయ పైరవీలు చేసిన వారికే సీట్లు ఇస్తున్నారన్నా. మాలాంటి పేదవాళ్లను పట్టించుకోవడం లేదు. నువ్వు సీఎం అయితేనే మాలాంటి వాళ్లు ఇంజినీరింగ్ విద్యనభ్యసించే అవకాశం ఉంటుందన్నా’అని వాపోయింది.