అన్నింట్లో ఫస్ట్‌

transport department income hikes in this year

జిల్లా రవాణాశాఖకు ప్రశంసల వర్షం

మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా బహుమతుల ప్రదానం

ప్రత్యేక కృషి చేసిన బసిరెడ్డిని అభినందించిన కమిషనర్, మంత్రి

సాక్షి, కడప : జిల్లా రవాణాశాఖ రాబడిలో దూసుకుపోవడంతోపాటు అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో నిలువడంతో సంబంధితశాఖ మంత్రి, ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించాయి. రవాణాశాఖను అభివృద్ధి బాటలో నడిపిస్తూనే ప్రమాదాల నివారణ, అధిక రాబడి సాధించిన నేపథ్యంలో ఆ శాఖ డిప్యూటీ కమిషనర్‌ మల్లెపల్లె బసిరెడ్డిని సత్కరించారు.2016–17లో రాష్ట్ర స్థాయిలో వైఎస్సార్‌ జిల్లా అన్ని పన్నుల వసూళ్లతోపాటు లక్ష్యాలను అధిగమించి రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. 2017–18 సంవత్సరానికి సంబంధించి ఆరు నెలల పన్నుల వసూళ్లలో కూడా రాష్ట్ర స్థాయిలో మళ్లీ మొదటి స్థానం సాధించింది. ఇందుకుగాను మంత్రి, ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించి బహుమతులను అందజేశారు.పలువురు బసిరెడ్డికి అభినందనలు తెలియజేశారు.

వైఎస్సార్‌ జిల్లా రవాణాశాఖ డీటీసీగా పనిచేస్తున్న బసిరెడ్డి కర్నూలుకు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయన రవాణాశాఖ రాబడి పెంచుతూనే లక్ష్యాలను అధిగమించడం, ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయడం పట్ల బెస్ట్‌  పర్‌ఫార్మెన్స్‌ కింద సత్కరించారు. విజయవాడలోని రవాణాశాఖ కమిషనరేట్‌ కార్యాలయంలో ఆ శాఖ మంత్రి అచ్చెంనాయుడు, కమిషనర్‌ బాలసుబ్రమణ్యం అభినందించారు. మిగతా అధికారులు ఈయనను స్ఫూర్తిగా తీసుకుని వృత్తిలో రాణించాలని వారు సూచించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top