వైద్యశాఖలో బదిలీలు ప్రారంభం | Transfers start in the medical department | Sakshi
Sakshi News home page

వైద్యశాఖలో బదిలీలు ప్రారంభం

Jun 2 2017 2:46 AM | Updated on Oct 9 2018 7:11 PM

జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. జాయింట్‌ కలెక్టర్‌–2 పి.రజనీకాంతరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రక్రియలో తొలిరోజు ఆఫీస్‌ సబార్డినేట్,

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. జాయింట్‌ కలెక్టర్‌–2 పి.రజనీకాంతరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రక్రియలో తొలిరోజు ఆఫీస్‌ సబార్డినేట్, ఎంఎన్‌ఓలు, స్వీపర్లు, తోటీ, కుక్, ఎఫ్‌ఎన్‌ఓ, ఫీల్డ్‌ వర్కర్లు, నైట్‌ వాచ్‌మెన్, వాచ్‌మెన్, డైవర్లు మొత్తం 44 మందికి బదిలీ చేశారు. ఐదేళ్ల పాటు ఒకేచోట పనిచేసిన వారు, మొత్తం సిబ్బందిలో 20 శాతానికి మించకుండా బదిలీ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ సనపల తిరుపతిరావు తెలిపారు. ఈ విభాగాల్లో 52 మంది బదిలీలకు అర్హులుగా 8 మందికి బదిలీలు జరగలేదు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ బి.సూర్యారావు, ఏఓ ధవళ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.  

జలవనరుల శాఖలో..  
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జలవనరుల శాఖలో అన్ని క్యాడర్లలో బుధవారం 82 మందికి బదిలీలు జరిగాయి. ఆన్‌లైన్‌లో ఆప్షన్లు పొందుపరిచిన మేరకు సీనియారిటీని బట్టి వీరిని ఆయా స్థానాలకు బదిలీ చేశారు. గురువారం ఉద్యోగులంతా విధుల్లో చేరినట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. కేడర్లSవారీగా పరిశీలిస్తే బొబ్బిలి సర్కిల్‌ నుంచి డీఈ, ఏఈలతో పాటు 23 మంది జూనియర్‌ అసిస్టెంట్లు, ఇద్దరు అసిస్టెంట్‌ టెక్నికల్‌ అధికారులు, ఇద్దరు ఐíసీ అసిస్టెంట్లు, ఐదుగురు జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్లకు బదిలీ అయ్యింది.

వంశధార ప్రాజెక్టు పరిధిలో 35మందికి బదిలీ..
బొడ్డేపల్లి రాజగోపాల్‌ వంశధార ప్రాజెక్టు పరిధిలో 35 మందికి బదిలీలు జరిగాయి. సీనియర్‌ అసిస్టెంట్లు 11 మందికి, జూనియర్‌ అసిస్టెంట్లు 10 మందికి స్థాన చలనం కలిగింది. వీరంతా గురువారం విధుల్లో చేరినట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.  

వ్యవసాయ శాఖలో..  
వ్యవసాయ శాఖలో ఏవోలు, ఏడీఏలు  వారం రోజుల క్రితం విజయవాడలో ఆన్‌లైన్‌లో వెబ్‌ ఆప్షన్లకు దరఖాస్తు చేసుకున్నారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఏఓలు 15 మందికి, ఏడీఏలు నలుగురికి బదిలీ జరిగాయని వ్యవసాయశాఖ జేడీ జి.రామారావు తెలిపారు. సూపరింటెండెంట్లు–2, సీనియర్‌ అసిస్టెంట్లు–2, జూనియర్‌ అసిస్టెంట్లు–4, టైపిస్టులు–2 చొప్పున మొత్తం 29 మందికి స్థాన చలనం కలిగిందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement