పుష్కరాలకు రైల్వే బాదుడు | train charges are increased for Godavari Pushkaralu | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు రైల్వే బాదుడు

Jun 12 2015 1:11 AM | Updated on Sep 3 2017 3:35 AM

గోదావరి పుష్కరాలకు వచ్చే ప్రయాణికులపై ‘పుష్కరమేళా సర్‌చార్జి’ పేరుతో ప్రత్యేక బాదుడుకు రైల్వే సిద్ధమైంది.

టిక్కెట్ స్థాయిని బట్టి రూ.5 నుంచి రూ.20 అదనపు భారం
సాక్షి, విజయవాడ/రాజమండ్రి సిటీ : గోదావరి పుష్కరాలకు వచ్చే ప్రయాణికులపై ‘పుష్కరమేళా సర్‌చార్జి’ పేరుతో ప్రత్యేక బాదుడుకు రైల్వే సిద్ధమైంది. జూలై 14 నుంచి 25 వరకు తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోని 7 స్టేషన్‌లకు ప్రయాణించేవారిపై ఈ సర్‌చార్జి వసూలు చేయనున్నట్లు విజయవాడ డివిజన్ సీనియర్ పీఆర్వో మైఖేల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి , గోదావరి, కొవ్వూరు స్టేషన్‌లు, తెలంగాణలో మంచిర్యాల, బాసర, భద్రాచలం రోడ్, రామగుండం స్టేషన్‌లు గమ్యంగా ప్రయాణించేవారికి ఈ సర్‌చార్జి పడుతుంది. సెకండ్ క్లాస్ (ఆర్డినరీ, మెయిల్, ఎక్స్‌ప్రెస్) టికెట్‌కు రూ.5, స్లీపర్ క్లాస్ (ఆర్డినరీ, మెయిల్, ఎక్స్‌ప్రెస్)కు రూ.5, ఏసీ చైర్ కార్, ఏసీ 3 టైర్ టికెట్‌కు రూ.10, ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్‌కు రూ.20 చొప్పున చెల్లించాలి. రూ.15 చార్జీ దాటిన టికెట్‌పైనే ఈ సర్‌చార్జి వసూలు చేస్తారు. ఈ స్టేషన్లలో ఇప్పటికే టికెట్లు జారీ చేసి ఉంటే సర్‌చార్జిని రైలులో టీటీఈలు వసూలుచేస్తారు. గత పుష్కరాలకూ ఇలాగే జరిగితే ప్రజలనుంచి నిరసనవ్యక్తమైంది. దీంతో రద్దుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement