దోపిడీ దొంగల అఘాయిత్యం | tractor show room owner attacked by thieves | Sakshi
Sakshi News home page

దోపిడీ దొంగల అఘాయిత్యం

Mar 25 2015 8:26 AM | Updated on Sep 2 2017 11:22 PM

ప్రకాశం జిల్లాలో దోపిడీ దొంగలు దారుణానికి తెగబడ్డారు.

పొదిలి: ప్రకాశం జిల్లాలో దోపిడీ దొంగలు దారుణానికి తెగబడ్డారు. పొదిలిలో మహీంద్రా ట్రాక్టర్ షోరూమ్‌ను నిర్వహిస్తున్న విజయ్‌కుమార్ దర్శిలో నివాసం ఉంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో దర్శి నుంచి పొదిలికి వస్తుండగా... రాజంపల్లి వద్ద నలుగురు యువకులు అడ్డగించి రూ. 37 వేల నగదు దోచుకున్నారు.

అంతటితో ఆగకుండా అతడిని చెట్టుకు కట్టేసి కొట్టి, ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో 70 శాతం కాలిన గాయాలతో బాధితుడు విజయ్‌కుమార్ ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విజయ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement