పండుగే పండుగ | Today's celebration of the festival of sakshi | Sakshi
Sakshi News home page

పండుగే పండుగ

Dec 23 2014 1:27 AM | Updated on Oct 1 2018 6:33 PM

పండుగే పండుగ - Sakshi

పండుగే పండుగ

వినియోగదారులకు అసలైన పండుగ వచ్చేసింది. లక్షాధికారులను చేయనుంది.

నేటి నుంచి  ‘సాక్షి పండుగ సంబరాలు’
రోజూ రూ.లక్ష గెలిచే అవకాశం
ఆరు కన్సొలేషన్ బహుమతులు
ప్రతి రోజూ ఏడుగురు విజేతలు

 
విజయవాడ : వినియోగదారులకు అసలైన పండుగ వచ్చేసింది. లక్షాధికారులను చేయనుంది. నగర పరిసర ప్రాంత ప్రజలను లక్షాధికారులను చేస్తున్న ‘సాక్షి పండుగ సంబరాలు’ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 6వ తేదీ వరకు రోజూ రూ.లక్ష గెలిచే అపూర్వ అవకాశాన్ని ‘సాక్షి’ ప్రజలకు అందిస్తోంది. బందరు రోడ్డులోని కళానికేతన్‌లో మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు ఈ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ డ్రాలో నిత్యం ఆరు కన్సొలేషన్ బహుమలు విజేతలకు అందిస్తారు. రోజూ జరిగే డ్రాలో ఏడుగురు విజేతలుగా నిలుస్తారు. ఈ సంబరాల్లో దాదాపు 105 మందిని విజేతలుగా ఎంపిక చేసి బహుమతులు అందజేస్తారు. ఈ సంబరాలకు కళానికేతన్ షాపింగ్ మాల్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తుండగా, కో-స్పాన్సర్స్‌గా సోనోవిజన్, మారుతీ సుజుకీ, మిత్రా హోండా తదితర సంస్థలు వ్యవహరిస్తున్నాయి.

టీవీ పార్టనర్‌గా సాక్షి టీవీ, రేడియో పార్టనర్‌గా రేడియో మిర్చి వ్యవహరిస్తున్నాయి.  మంగళవారం నుంచి జనవరి 6వ తేదీ వరకు పైన తెలిపిన ఏ షాపులో కొనుగోలు చేసి పొందిన కూపన్‌ను అక్కడే డ్రా బాక్స్‌లో వేయాలి. ఏ రోజుకు ఆ రోజు తీసే డ్రాలో గెలుపొందిన వినియోగదారులు సంతోషంగా క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి పండుగలు జరుపుకోవాల్సిందిగా నిర్వాహకులు తెలిపారు. ఇతర వివరాలకు మంగళవారం సాక్షి దినపత్రిక సిటీ 3వ పేజీ చూడాలని సూచించారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement