నేడు సీఎం పర్యటన

Today Cm Chandrababu Naidu Tour In Kurnool - Sakshi

మధ్యాహ్నం 1.45 గంటలకు రాక

జీఎన్‌ఎస్‌ఎస్‌ హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి గండికోట రిజర్వాయర్‌కు నీటి విడుదల

కొలిమిగుండ్లలో బహిరంగ సభ

కర్నూలు(అగ్రికల్చర్‌): ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలోని అవుకు, కొలిమిగుండ్ల మండలాల్లో పర్యటిస్తారు. ముందుగా ప్రకటించిన పర్యటన షెడ్యూల్‌లో మార్పులుచోటుచేసుకున్నాయి. తిరుపతిలో పర్యటించిన అనంతరం  ఇక్కడికి రానున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకొని.. అక్కడి నుంచి తిరుపతి వెళతారు. అక్కడ పర్యటన ముగిసిన తర్వాత ప్రత్యేక విమానంలో కడప చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 1.45 గంటలకు అవుకు మండలం రామాపురానికి వస్తారు.

రెండు గంటలకు అవుకు రిజర్వాయర్‌ సమీపంలోని గాలేరు–నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్‌) హెడ్‌రెగ్యులేటర్‌కు చేరుకుంటారు. 2.30 గంటల వరకు అక్కడ జలశ్రీకి హారతి, జీఎన్‌ఎస్‌ఎస్‌ హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి గండికోట రిజర్వాయర్‌కు నీటి విడుదల, గోరుకల్లు రిజర్వాయర్, పులికనుమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయడం, అవుకు రిజర్వాయర్‌లో బోటింగ్, రెస్టారెంట్, వీఐపీ గెస్ట్‌హౌస్‌ ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 2.40 గంటలకు కొలిమిగుండ్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానానికి చేరుకుంటారు. 2.45 నుంచి 4.30 వరకు బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారు.

ఏర్పాట్ల పరిశీలన
కొలిమిగుండ్ల/అవుకు:  సీఎం పర్యటన సందర్భంగా చేసిన ఏర్పాట్లను మంత్రి అఖిలప్రియతో పాటు జిల్లా అధికారులు శుక్రవారం పరిశీలించారు. అవుకులో ఏర్పాట్లను మంత్రి అఖిలప్రియ, జేసీ ప్రసన్న వెంకటేష్, వివిధ శాఖల జిల్లా, డివిజన్‌ స్థాయి అధికారులు పరిశీలించారు. అలాగే కొలిమిగుండ్ల ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బహిరంగ సభ ఏర్పాట్లను రాయలసీమ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ చూశారు. సభా ప్రాంగణంతో పాటు ఇతర ప్రాంతాలను తనిఖీ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top