తెలంగాణ స్థాయి కి చేరేలా మాస్టర్ ప్లాన్ | To reach to the level of Telangana Master Plan | Sakshi
Sakshi News home page

తెలంగాణ స్థాయి కి చేరేలా మాస్టర్ ప్లాన్

Jun 2 2014 1:05 AM | Updated on Jul 28 2018 3:23 PM

తెలంగాణ స్థాయి కి చేరేలా మాస్టర్ ప్లాన్ - Sakshi

తెలంగాణ స్థాయి కి చేరేలా మాస్టర్ ప్లాన్

ఆదాయ వనరులు, రుణ పరపతి పెంపు విషయంలో తెలంగాణ స్థాయికి సీమాంధ్రను తీసుకువెళ్లడానికి అవసరమైన మాస్టర్ ప్లాన్‌ను తయారు చేయాలని కాబోయే సీఎం చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

అధికారులకు చంద్రబాబు ఆదేశం.. పలు అంశాలపై సమీక్ష

 హైదరాబాద్: ఆదాయ వనరులు, రుణ పరపతి పెంపు విషయంలో తెలంగాణ స్థాయికి సీమాంధ్రను తీసుకువెళ్లడానికి అవసరమైన మాస్టర్ ప్లాన్‌ను తయారు చేయాలని కాబోయే సీఎం చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్ర విభజన, సీమాంధ్రలో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై చంద్రబాబు ఆదివారం ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు.

చంద్రబాబు మాట్లాడుతూ విభజన వల్ల సీమాంధ్రకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను సమర్పించాల్సిందిగా అధికారులకు సూచించారు. కొత్తగా విమానాశ్రయాలను ఎక్కడ ఏర్పాటు చేయవచ్చు, రోడ్డు, రైలు, విమాన సౌకర్యాలు లేని ప్రాంతాలు ఏవి? వీటి కోసం ఎంత మేర పెట్టుబడులు అవసరం అవుతాయో తెలియజేయూలన్నారు. తీసుకోవాల్సిన చర్యలపై వారంలో నివేదికలు సమర్పిస్తామని నూతన ఆంధ్రప్రదేశ్ సీఎస్ కృష్ణారావు చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement