ఈనెల 7 నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షల వేళలను ప్రభుత్వ పరీక్షల విభాగం ఇది వరకే మార్పు చేసింది.
సాక్షి, హైదరాబాద్: ఈనెల 7 నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షల వేళలను ప్రభుత్వ పరీక్షల విభాగం ఇది వరకే మార్పు చేసింది. కొత్త వేళలు నేటి నుంచి జరిగే పరీక్షలకు వర్తిస్తాయి. సోమవారం నుంచి ఈనెల 17 వరకు జరిగే అన్ని పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతాయి.
మొదట 7, 12 తేదీల్లో నిర్వహించే పరీక్షలను మాత్రమే ఉదయం 11 గంటలకు ప్రారంభించాలని, మిగతా పరీక్షలు ఉదయం 9:30 గంటలకే ప్రారంభించాలని భావించింది. అయితే విద్యార్థులు అనవసరంగా గందరగోళానికి గురవుతారనే ఉద్దేశంతో 7వ తేదీ నుంచి జరిగే అన్ని పరీక్షల వేళలను మార్పు చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ మన్మథరెడ్డి తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు కొనసాగుతాయన్నారు.