విభజన అంశంపై కేంద్ర ప్రభుత్వ దూకుడుకు నిరసనగా సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక గురువారం బంద్‌కు పిలుపునిచ్చింది
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: విభజన అంశంపై కేంద్ర ప్రభుత్వ దూకుడుకు నిరసనగా సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక గురువారం బంద్‌కు పిలుపునిచ్చింది. విద్యార్థి, ప్రజా సంఘాలు కూడా మద్దతు పలికాయి. బంద్‌ను విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు వి.సి.హెచ్.వెంగళ్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో, కళాశాలలన్నీ బంద్‌లో భాగంగా మూతపడనున్నాయన్నారు.
వ్యాపార, వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసివేయాలని కోరారు. సమైక్యాంధ్ర పరిరక్షణలో భాగంగా చేపడుతున్న బంద్‌కు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, విద్యార్థులు, ప్రజాసంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాలన్నారు. ఆర్టీసీ బస్సులను సైతం తిరుగనివ్వబోమన్నారు. ప్రజలు సహకరించాలని ఆయన పేర్కొన్నారు.