తల్లిఒడికి చేరిన బాలుడు వీరేష్‌...

 Tirupati Policies handover The Boy To Parents - Sakshi

సాక్షి, తిరుపతి: బాలుడు వీరేష్‌ అపహరణ కథ ఎట్టకేలకు ముగిసింది. తిరుపతిలో కిడ్నాప్‌కు గురైన వీరేష్‌ను పోలీసులు మంగళవారం తిరుపతికి తీసుకువచ్చారు. పూణేలో కిడ్నాపర్‌ను గుర్తించిన అక్కడి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని గుర్తించడంలో సీసీ పుటెజీలు తమకు ఎంతో ఉపయోగపడ్డాయని తిరుపతి అర్బన్‌ ఎస్పీ అన్బు రాజన్‌ తెలిపారు. కిడ్నాపర్‌ను నిజామాబాద్‌ జిల్లాకు చెందిన వాడిగా గుర్తించారు.

ఈ నెల 28లో తిరుపతిలో బాలుడు వీరేష్‌ను కిడ్నాప్‌ చేసి మహారాష్ట్రకు పారిపోయిన విషయం తెలిసిందే. పూణే పోలీసులు అతని అనుమానాస్పదంగా కనిపించడంతో అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కిడ్నాప్‌ కథ ఒ​కొలిక్కి వచ్చింది. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించడంతో వారు అనందంలో మునిగిపోయ్యారు. మూడు రోజుల్లోనే కేసును ఛేదించిన తిరుపతి పోలీసులపై పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.  

ఆ బాలుడు ఎలా దొరికాడంటే..!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top