రెండు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఉత్తర్వులు

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌రావు
సాక్షి, నాయుడుపేట: తిరుపతిలో పార్లమెంట్ పరిధిలో రెండు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయ్యాయని తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌రావు తెలిపారు. ఈమేరకు శుక్రవారం కేంద్రమానవ వనరులశాఖ మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని పెళ్లకూరు మండలం పాలచ్చూరులో, చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం కైలాసకోనలో రెండు కేంద్రీయ విద్యాలయాలను వచ్చే విద్య సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్టు తెలిపారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సారథ్యంలో సంబంధిత శాఖ కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకుకెళ్లి మంజూరుకా కృషి చేస్తున్నట్లు ఎంపీ వెల్లడించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి