కృష్ణాజిల్లాకు పిడుగు హెచ్చరిక | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లాకు పిడుగు హెచ్చరిక

Published Tue, May 1 2018 4:29 PM

Thunderbolt Alert In Krishna District - Sakshi

సాక్షి, విజయవాడ: కృష్ణాజిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. జిల్లాలోని విజయవాడ రూరల్‌, గంపలగూడెం, ఆగిరిపల్లి, కైకలూరు. విసన్నపేట, గన్నవరం, నూజీవిడు, మండవల్లి, చాట్రాయి, కలిదిండి మండలాల్లో పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రకటన చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షితమైన భవనాలలో ఆశ్రయం పొందాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు సూచించారు. కైకలూరులో భారీగ ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఇక విజయవాడ, గన్నవరంలోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతం కావడంతో సాయంత్రం నాలుగు గంటలకే నగరమంతా చీకటిమయమైంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.


గుంటూరు జిల్లాలో చల్లబడిన వాతావరణం
జిల్లాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఇక గుంటూరులో భారీగా వీస్తున్న గాలులతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. మరోవైపు వర్షపు థాటికి రోడ్లు జలమయం అయ్యాయి.

మరోవైపు ఉత్తరాంధ్రలోని అనేక ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో  పిడుగులు ఉధృతంగా పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచినలు చేసింది. ప్రజలను సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు రాష్ట్ర విపత్తుల నిర్వాహణ శాఖ ఆదేశాలు జారీ చేసింది.  పార్వతీపురం, కురుపాం, గజపతినగరం, ఇచ్చాపురం, పలాస, ఆమదాలవలస, శ్రీకాకుళంలో ఈదురు గాలులతో  వర్షం కురుస్తోంది.

Advertisement
Advertisement