మూడేళ్ల బాలుడి కిడ్నాప్... రూ. కోటి డిమాండ్ | Three year old boy mohit kidnaped in nellore | Sakshi
Sakshi News home page

మూడేళ్ల బాలుడి కిడ్నాప్... రూ. కోటి డిమాండ్

Mar 3 2015 3:24 PM | Updated on Aug 28 2018 7:09 PM

మూడేళ్ల బాలుడి కిడ్నాప్... రూ. కోటి డిమాండ్ - Sakshi

మూడేళ్ల బాలుడి కిడ్నాప్... రూ. కోటి డిమాండ్

నెల్లూరులోని సైదాపురంలో మూడేళ్ల చిన్నారి మోహిత్ను మంగళవారం ఆగంతకులు కిడ్నాప్ చేశారు.

నెల్లూరు: నెల్లూరులోని సైదాపురంలో మూడేళ్ల బాలుడు మోహిత్ను మంగళవారం ఆగంతకులు కిడ్నాప్ చేశారు. మోహిత్ను విడిచిపెట్టాలంటే రూ. కోటి చెల్లించాలని కిడ్నాపర్లు మోహిత్ తల్లిదండ్రులకు ఫోన్ లో డిమాండ్ చేశారు. దాంతో వారు నగర పోలీసులను ఆశ్రయించారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అలాగే చిన్నారి కిడ్నాప్కు రియల్ ఎస్టేట్ వివాదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement