గుంటూరు జిల్లాలోని చేబ్రోలు మండలం నారాకోడూరులో గురువారం ఉదయం రెండు బైకులు ఢీకొని ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు.
గుంటూరు జిల్లాలోని చేబ్రోలు మండలం నారాకోడూరులో గురువారం ఉదయం రెండు బైకులు ఢీకొని ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మరోకరి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడని విద్యార్థిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
అలాగే విశాఖ పట్నం జిల్లాలోని ఎస్.రాయవరం మండలం పెద్ద గుమ్ములూరులో ఈ రోజు ఉదయం ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 28 మంది గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను విశాఖలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ఎనిమిది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.


