
ఒకే కాన్పులో జన్మించిన ఆడ పిల్లలు పిల్లలకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ రామలక్ష్మి
తూర్పుగోదావరి, ఏలేశ్వరం (పత్తిపాడు) : ఏలేశ్వరంలో శుక్రవారం ఓ మాతృమూర్తి ఒకే కాన్పులో ముగ్గురు ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. పట్ణణంలోని పెద్దవీధి ఎస్సీపేటకు చెందిన శ్రీకాకోలు సం«ధ్య (22) రెండో కాన్పు నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేరింది. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో వైద్యురాలు రామలక్ష్మి పర్యవేక్షణలో సహజ ప్రసవం చేశారు. పుట్టిన ముగ్గురు ఆడపిల్లలూ ఒక్కొక్కరు కేజీన్నర బరువు ఉండి ఆరోగ్యంగా ఉన్నారు. రామలక్ష్మి భర్త రత్నరాజు కూలి పని చేసి కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఈ దంపతులకు మొదటి కాన్పులో కూడా ఆడపిల్లే పుట్టింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా సహజ సహజ ప్రసవం అయ్యేలా సేవలు అందించిన వైద్యురాలు రామలక్ష్మిని, సిబ్బందిని పలువురు అభినందించారు. తల్లితో పాటు ముగ్గురు పిల్లలను వెద్య పరీక్షల నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు ౖతరలించారు.