ఖాతాలు లేని బ్యాంకుల్లోకి నగదు బదిల | those who not having bank accounts also fund will transfer | Sakshi
Sakshi News home page

ఖాతాలు లేని బ్యాంకుల్లోకి నగదు బదిల

Nov 28 2013 3:37 AM | Updated on Apr 3 2019 9:21 PM

వంట గ్యాస్ నగదు బదిలీ పథకం వినియోగదారులను అయోమయంలో పడేస్తోంది. తమకు ఖాతాలు లేని బ్యాంకుల్లో నగదు చేరుతున్న సమాచారం వస్తుండటంతో దీంతో విని యోగదారులు ఆందోళనకు గురవుతున్నారు.

కావలి/ కోవూరు, న్యూస్‌లైన్ : వంట గ్యాస్ నగదు బదిలీ పథకం వినియోగదారులను అయోమయంలో పడేస్తోంది. తమకు ఖాతాలు లేని బ్యాంకుల్లో నగదు చేరుతున్న సమాచారం వస్తుండటంతో దీంతో విని యోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో 4.19 లక్షల వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో సుమారు 2.2 లక్షల కనెక్షన్లకు ఆధార్ కార్డులను ఏజెన్సీలకు అప్పగించారు. ఆధార్
 
 ఇచ్చిన వారందరూ బ్యాంక్ అకౌంటుతో సంబంధం లేకుండా రూ.1,073 గ్యాస్ సిలిండర్ కోసం చెల్లించాల్సి ఉంది. చెల్లించిన తర్వాత వెంటనే బ్యాంక్ అకౌంటు లేని వారికి ఐసీఐసీఐ బ్యాంక్‌లో పడినట్లు జిల్లాలో ఎక్కువగా సెల్‌ఫోన్ మెసేజ్‌లు వినియోగదారులకు వస్తున్నాయి. స్థానిక ఐసీఐసీఐ బ్యాంక్‌కు వెళ్లి తమ సబ్సిడీ ఇక్కడకు బదిలీ కావడంతో సిబ్బందిని అడుగుతున్నారు. ఖాతా లేకుండా బ్యాంక్‌లోకి ఎలా వస్తుందని సిబ్బంది వారిని ఎదురు ప్రశ్నించి తిరిగి పంపుతున్నారు. పట్టణంలో నాలుగు ఏజెన్సీలు, 45,367 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 20 వేల కనెక్షన్లకు ఆధార్ కార్డులను తీసుకున్నారు. 20 శాతానికి పైగా వినియోగదారులకు అకౌంట్ లేని బ్యాంకుల్లో నగదు బదిలీ అయినట్లు మెసేజ్‌లు వస్తున్నాయి. ఈ విషయంపై పౌరసరఫరాల శాఖ అధికారుల దగ్గర సరైన సమాధానం లేదు. ఒక వైపు అన్నిస్థాయిల్లో కోర్టులు ఆధార్ అనుసంధానంపై అసహనం వ్యక్తం చేస్తున్నా పాలకులు మాత్రం బేఖాతర్ చేస్తున్నారు. పాలకుల ఆదేశాల మేరకు ఆధార్ అనుసంధాన ప్రక్రియను అధికారులు కొనసాగిస్తున్నారు.   
 
  బదిలీ బేజార్
 నిన్న మొన్నటి వరకు గ్యాస్ కొనుగోలుకు రూ.418 సరిపోయేది. ప్రస్తుతం గ్యాస్ కొనాలంటే రూ.1018 తప్పనిసరి. దీంతో సామాన్యులు బేజారెత్తుతున్నారు. ఇదిలా ఉండగా సబ్సిడీ సొమ్ము తమ అకౌంట్‌లో కాకుండా వేరే అకౌంట్‌లో పడుతుండటంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల కోవూరులోని ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ వద్దకు బుచ్చిరెడ్డిపాళెంలో ఖాతా ఉన్న లబ్ధిదారుడు వచ్చాడు. నగదు బదిలీ కింద సబ్సిడీ జమ కావడంపై తెలుసుకునేందుకు వచ్చాడు. సబ్సిడీ సొమ్ము అతని ఖాతాలో జమ కాలేదు. ఈ విషయమై గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులను అతను ప్రశ్నించాడు. ఖాతాదారుడి నంబర్ ఆధారంగా పరిశీలించగా ఐసీఐసీఐ బ్యాంక్‌లో సబ్సిడీ సొమ్ము జమ అయినట్టు తేలింది. ఏమి చేయాలో దిక్కుతోచక అతను వెనుదిరిగాడు.
 
 ఆందోళన అవసరం లేదు
 నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్:  నగదు బదిలీ పథకంలో సబ్సిడీ మొత్తం వినియోగదారుల అకౌంట్‌లో కాకుండా ప్రైవేట్ బ్యాంక్‌లో జమ అవుతున్నట్టు సమాచారం అందింది. వినియోగదారులు ఆందోళన చెందవద్దు. లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వరరావు సూచనల మేరకు తక్షణం సంబంధిత గ్యాస్ ఏజెన్సీలకు తమ బ్యాంక్ ఖాతా నంబరు సమర్పిస్తే గ్యాస్ సబ్సిడీ మొత్తం వినియోగదారుల ఖాతాలో జమ అవుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement