సీఎం జగన్‌ విజన్‌ ఉన్న నాయకుడు | Thopudurthi Prakash Reddy Praises CM YS Jagan Over Corona Virus | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ విజన్‌ ఉన్న నాయకుడు

Apr 18 2020 9:26 PM | Updated on Apr 18 2020 9:30 PM

Thopudurthi Prakash Reddy Praises CM YS Jagan Over Corona Virus - Sakshi

సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజన్ ఉన్న నాయకుడని, పక్కా ప్రణాళికతో కరోనాపై యుద్ధం చేస్తున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రత్యేక కృషి వల్లే  లక్ష కరోనా ర్యాపిడ్ కిట్లు ఏపీకి వచ్చాయన్నారు. ప్రతీ ఒక్కరికి మూడు మాస్కులు ఇవ్వాలన్న జగన్ ఆదేశాలు అభినందనీయమని పేర్కొన్నారు. పేదలు పస్తులు ఉండకూడదన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఏపీలో కరోనా అదుపులోకి రావటం చంద్రబాబుకు ఇష్టం లేనట్లుందని మండిపడ్డారు. సీఎం జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని, ముఖ్యమంత్రి పకడ్బందీ చర్యలు చూసి చంద్రబాబు తట్టుకోలేక ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలు బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement